తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళ భాష: మద్రాస్ హైకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు

  • ప్రభుత్వ ఉద్యోగాల కోసం తమిళం తప్పనిసరి అన్న మధురై బెంచ్
  • తమిళం తెలియకపోతే నిత్యం ప్రజల్లో ఉండి ఎలా పని చేస్తారని ప్రశ్న
  • తమిళం రాయడం, చదవడం నేర్చుకోవాలన్న హైకోర్టు బెంచ్
తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులకు తమిళం రావాలని, రాయడం, చదవడం నేర్చుకోవాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం తప్పనిసరి అని తెలిపింది. నిత్యం ప్రజల మధ్య ఉండి పని చేయాల్సిన ఉద్యోగులకు మాతృభాష అయిన తమిళం తెలియకపోతే రోజువారీ పనులను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది.

తమిళ భాషలో నిర్వహించిన పరీక్షలో విఫలమైనందుకు తనను తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగం నుంచి తొలగించిందని ఆరోపిస్తూ జయకుమార్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు.

తన తండ్రి నావికాదళంలో పని చేస్తుండటం వల్ల తాను సీబీఎస్ఈ పాఠశాలల్లో చదివానని, దీంతో తమిళం నేర్చుకోవడానికి వీలుపడలేదని కోర్టుకు తెలిపారు. అతని పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం, తమిళం రావాల్సిందేనని తెలిపింది.

ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర భాష వచ్చి ఉండాలని లేదంటే వారు విధులను సమర్థవంతంగా నిర్వహించలేరని కోర్టు వ్యాఖ్యానించింది.


More Telugu News