చ‌ర‌ణ్‌కు తార‌క్ బర్త్ డే విషెస్

  • ఈరోజు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు
  • చెర్రీకి సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లువెత్తుతున్న బ‌ర్త్‌డే విషెస్
  • 'ఎక్స్' వేదిక‌గా చ‌ర‌ణ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన తార‌క్
ఈరోజు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా చెర్రీకి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు ప్ర‌ముఖులు, అభిమానులు బ‌ర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ కూడా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా చ‌ర‌ణ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. నా ప్రియ‌మైన సోద‌రుడికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంటూ తార‌క్ ట్వీట్ చేశారు. 

"నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మీపై ఎల్ల‌ప్పుడూ ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలి" అని ఎన్‌టీఆర్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా, చ‌రణ్‌, తార‌క్ ఇద్ద‌రూ క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో అద‌ర‌గొట్టిన‌ విష‌యం తెలిసిందే. 

అల్లూరిగా చెర్రీ, కొమురం భీమ్‌గా ఎన్‌టీఆర్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ద్వారా ఈ స్టార్ హీరోల ఇమేజ్ గ్లోబ‌ల్ లెవెల్‌కి చేరింది. ఈ చిత్రానికి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా ద‌క్క‌డం విశేషం.


More Telugu News