వల్లభనేని వంశీకి ఒక రోజు పోలీస్ కస్టడీ

  • భూ వివాదంలో వంశీపై ఉంగుటూరు పీఎస్ లో కేసు నమోదు
  • కస్టడీ పిటిషన్ వేసిన పోలీసులు
  • కస్టడీకి అనుమతిస్తూ గన్నవరం కోర్టు ఉత్తర్వులు
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఒకరోజు పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గన్నవరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక భూవివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం వంశీని కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒకరోజు కస్టడీకి అనుమతినిచ్చింది. ప్రస్తుతం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 


More Telugu News