రష్మికకు బర్త్ డే విషెస్ తెలిపిన ది గర్ల్ ఫ్రెండ్ , కుబేర చిత్రబృందాలు

  • నేడు రష్మిక పుట్టినరోజు 
  • ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం నుంచి ‘రేయి లోలోతుల’ పాట టీజర్ విడుదల
  • కుబేర సెట్స్‌లో రష్మి బీటీఎస్ వీడియో విడుదల.
భారీ హిట్  చిత్రాల తారగా, నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రష్మిక మందన్న నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో, ఆమె నటిస్తున్న కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల యూనిట్లు బర్త్ డే విషెస్ తెలియజేశాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘కుబేర’ చిత్రం యూనిట్, రష్మిక మందన్న చిత్ర సెట్స్‌లో ఉన్న ఒక అందమైన బీటీఎస్ (బిహైండ్ ది సీన్స్) వీడియో క్లిప్‌ను విడుదల చేసింది.  ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం నుంచి ‘రేయి లోలోతుల’ అనే టీజర్ ఆడియో పాటను విడుదల చేశారు. 

ముందుగా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ యూనిట్ రష్మికకు శుభాకాంక్షలు తెలిపింది. ‘రేయి లోలోతుల’ అనే టీజర్ ఆడియో పాటను హేషమ్ అబ్దుల్ వహాబ్, చిన్మయి శ్రీపాద, విజయ్ దేవరకొండ కలిసి ఆలపించారు. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించారు. పాటలో ఒక కవితను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా రాశారు.

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన ఎక్స్ ఖాతాలో పాట టీజర్ లింక్‌ను పంచుకుంటూ, రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు చాలా విలువైనవారు! దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు! మీకు ప్రేమ, ఆనందం, ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలి. ది గర్ల్ ఫ్రెండ్ పాట టీజర్ విడుదలైంది" అని పేర్కొన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నతో పాటు దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం అందించారు.

మరోవైపు, ‘కుబేర’ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, రష్మిక సెట్స్‌లో ఉన్నప్పటి అందమైన బిహైండ్ ది సీన్ విజువల్స్‌ను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ ఇలా ట్వీట్ చేసింది, "మా అందమైన రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు. శేఖర్ కమ్ముల కుబేరలో మీ నటనలాగే మీ రోజు కూడా ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం." అని పేర్కొంది.

‘కుబేర’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చైతన్య పింగళి సహ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News