యువతకు ఉద్యోగాలు ఇవ్వండి: రాహుల్ గాంధీ

  • ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో బీహార్‌లో ర్యాలీ
  • బీహార్ యువతకు ఉద్యోగాలు ఎందుకివ్వలేదని రాహుల్ గాంధీ నిలదీత
  • తమ భవితవ్యాన్ని తాము రాసుకోవడానికి బీహార్ యువత సిద్ధంగా ఉందన్న రాహుల్ గాంధీ
బీహార్ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు పారిపోవద్దని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఎన్ఎస్‌యూఐ నేషనల్ ఇన్‌ఛార్జ్ కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.

ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీహార్ యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఎందుకు కల్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. తమ భవితవ్యాన్ని తాము తీర్చిదిద్దుకోవడానికి బీహార్ యువత సంసిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ సంవత్సరం చివరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాష్ట్రంలోని 40 సంస్థాగత జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందిస్తోంది.


More Telugu News