ఐపీఎల్ చరిత్రలో అన్ని స్థానాల్లోనూ బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్క ఆటగాడిగా విండీస్ ఆల్‌రౌండర్

  • ‌కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సునీల్ నరైన్
  • ఓపెనర్‌గానే అత్యధిక పరుగులు 
  • మొత్తం 17 సార్లు డకౌట్
  • ఇప్పటి వరకు ఒక సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలు చేసిన నరైన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని అన్ని స్థానాల్లోనూ బ్యాటింగ్ చేసిన ఏకైక క్రికెటర్‌గా విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహస్తున్న నరైన్ ఇప్పటి వరకు 115 ఇన్నింగ్స్‌లు ఆడి 167.41 స్ట్రైక్ రేట్‌తో 1,659 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా 177.98 స్ట్రైక్ రేట్‌తో 1,342 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 109 పరుగులు.  

సునీల్ నరైన్ ఓపెనర్‌గా 59 సార్లు దిగాడు. మూడు, ఆరో స్థానాల్లో ఒక్కోసారి ఆడాడు. 8 సార్లు నాలుగో స్థానంలో, ఐదో స్థానంలో ఏడుసార్లు ఆడాడు. ఏడో స్థానంలో ఆరు సార్లు, 8వ స్థానంలో 13 సార్లు, 9వ స్థానంలో 9 సార్లు, పదో స్థానంలో 8 సార్లు బ్యాటింగ్ చేశాడు. 11వ స్థానంలో 3 సార్లు ఆడాడు. 

అయితే, ఓపెనర్‌గా తప్ప మరే స్థానంలోనూ పెద్దగా రాణించలేకపోయాడు. మిడిల్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసినప్పుడు పరుగుల కోసం ఇబ్బంది పడ్డాడు. ఓపెనర్‌గా అత్యధికంగా 7 సార్లు డకౌట్ అయ్యాడు. మొత్తంగా ఇప్పటి వరకు 17 సార్లు డకౌట్ అయ్యాడు. అయితే, ఎన్నోసార్లు తన అద్వితీయమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌లను మలుపుతిప్పి జట్టుకు విజయాన్ని అందించిపెట్టాడు.


More Telugu News