గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ చైర్‌పర్సన్‌గా జయసుధ

  • పదిహేను మంది సభ్యులతో జ్యూరీ కమిటి ఏర్పాటు
  • జయసుధ, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌లతో దిల్ రాజు సమావేశం
  • నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సూచన
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ ఎంపికయ్యారు. మొత్తం పదిహేను మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు. జయసుధ, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌లతో ఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు సమావేశమయ్యారు.

నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సూచించారు. ఎంపిక ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డులకు ఇంతటి స్పందన రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

అవార్డుల కోసం దాఖలైన నామినేషన్లను ఈ నెల 21వ తేదీ నుంచి జ్యూరీ పరిశీలించనుంది. తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో కలిపి 1,248 నామినేషన్లు రాగా, వ్యక్తిగత కేటగిరీలో 1,172, ఫీచర్ ఫిల్మ్, చిల్ట్రన్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీలలో 76 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.


More Telugu News