శుభ ముహూర్తాలు కొన్నే.. ఫంక్షన్ హాళ్లకు పెరిగిన గిరాకీ

  • కళకళలాడుతున్న పెళ్లి మండపాలు 
  • కుదిరిన ముహూర్తంలోనే పెళ్లికి తొందర
  • జూన్‌లో నాలుగే ముహూర్తాలు
  • ఆగస్టు-సెప్టెంబర్‌లో శూన్యమాసం
ఈ ఏడాది చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో శుభ ఘడియలు కొన్ని మాత్రమే ఉండటంతో కుదిరిన ముహూర్తంలో పెళ్లి చేసేయాలని పెద్దలు నిర్ణయం తీసుకుంటున్నారు. ఫలితంగా ఉభయ తెలుగు రాష్ట్రాలూ పెళ్లి కళను సంతరించుకున్నాయి. ఈ నెల 12న శుభ ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. 18, 20, 23, 30 తేదీల్లో ఇంకా ముహూర్తాలు మిగిలి ఉన్నాయి. అలాగే, మే ఒకటో తేదీ నుంచి 28 మధ్య 11 ముహూర్తాలున్నాయి.

ఆ తర్వాత జూన్‌లో నాలుగంటే నాలుగే ముహూర్తాలున్నాయి. ఆగస్టు-సెప్టెంబర్‌లో శూన్యమాసం వస్తుండటంతో నెల రోజులపాటు పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాళ్లు బోసిపోనున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మంచి రోజులు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాదికి ఇవే ముహూర్తాలు కావడంతో ఫంక్షన్ హాళ్లకు గిరాకీ పెరిగింది.


More Telugu News