భార్య ఘాతుకం.. భ‌ర్త‌ను చంపి.. మృతదేహాన్ని వీడియోకాల్‌లో ల‌వ‌ర్‌కు చూపించిన వైనం!

  • మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఘ‌ట‌న‌
  • ప్రియుడి స్నేహితుల‌తో క‌లిసి భ‌ర్త‌ను మ‌ట్టుపెట్టిన భార్య‌
  • ఆ త‌ర్వాత వీడియోకాల్ చేసి భ‌ర్త మృత‌దేహాన్ని బాయ్‌ఫ్రెండ్‌కు చూపించిన భార్య‌
  • న‌లుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో 25 ఏళ్ల వ్యక్తిని అతని 17 ఏళ్ల భార్య, ఆమె ప్రేమికుడి స్నేహితులు పగిలిన బీరు బాటిల్‌తో పొడిచి దారుణంగా హ‌త్య చేశార‌ని పోలీసులు గురువారం తెలిపారు. ఇండోర్-ఇచాపూర్ హైవేలోని ఐటీఐ కళాశాల సమీపంలో బాధితుడు గోల్డెన్ పాండే అలియాస్ రాహుల్‌ను నిందితులు 36 సార్లు కత్తితో పొడిచి చంపిన‌ట్లు పోలీసులు చెప్పారు. నలుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు. 

బుర్హాన్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) దేవేంద్ర పాటిదార్ చెప్పిన వివ‌రాల ప్రకారం... "నాలుగు నెలల క్రితం ఈ జంట‌కు వివాహమైంది. షాపింగ్‌కు వెళ్లిన దంపతులు మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్‌ వద్ద భోజ‌నం చేశారు. అనంతరం ఇరువురు బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో తన చెప్పు కింద పడిపోయిందని భార్య తన భర్తతో చెప్పింది. దీంతో పాండే బైక్‌ ఆపాడు. వెంటనే ఆమె ప్రియుడు యువ‌రాజు స్నేహితులిద్దరు పాండేను పగిలిన బీరు సీసాతో 36 సార్లు పొడిచారు. దాంతో అత‌డు అక్కడికక్కడే చ‌నిపోయాడు. అనంతరం త‌న భ‌ర్త మృతదేహాన్ని యువరాజుకు వీడియోకాల్‌లో భార్య‌ చూపించింది. ఆ త‌ర్వాత మృతదేహాన్ని సమీపంలోని పొలంలో విసిరేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు" అని ఎస్పీ పాటిదార్ చెప్పారు. 
  
ఈ క్ర‌మంలో ఆదివారం (ఏప్రిల్ 13) మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన రాహుల్ కుటుంబం, ఇంటి నుంచి బయటకు వెళ్లిన‌ప్పుడు అతను తన భార్యతో చివరిసారిగా కనిపించాడని వారు చెప్పారని తెలిపారు. అదే స‌మ‌యంలో అత‌ని భార్య కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బృందాలుగా ఏర్పడి వారి కోసం వెతికారు. 

మైనర్‌ భార్యతో పాటు ఆమె ప్రియుడు యువరాజు, అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు నేరాన్ని అంగీకరించారు. దాంతో ఈ నలుగురిపై హత్య, హత్యకు కుట్ర పన్నడం, ఆధారాలను దాచడం వంటి అభియోగాలు మోపారు. 


More Telugu News