ఖ‌లిస్థానీలు నా హ‌త్య‌కు కుట్ర ప‌న్నుతున్నారు.. కేంద్ర‌మంత్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌!

  • ఖ‌లిస్థానీలు త‌న‌ హ‌త్య‌కు కుట్ర చేస్తున్నార‌న్న‌ రైల్వేశాఖ సహాయ మంత్రి ర‌వ‌నీత్ సింగ్ 
  • 'వారిస్ పంజాబ్ దే సంస్థ‌'తో సంబంధం ఉన్న ఖ‌లిస్థానీ మ‌ద్ధ‌తుదారులపై మంత్రి ఆరోప‌ణ‌
  • త‌న‌తో పాటు పంజాబ్‌లో మ‌రికొంత మంది రాజ‌కీయ నేత‌ల ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని వ్యాఖ్య
రైల్వేశాఖ సహాయ మంత్రి ర‌వ‌నీత్ సింగ్ బిట్టు, ఖ‌లిస్థానీలు త‌న‌ హ‌త్య‌కు కుట్ర ప‌న్నుతున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాడిక‌ల్ ప్ర‌చార‌కుడు, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ న‌డిపిస్తున్న 'వారిస్ పంజాబ్ దే సంస్థ‌'తో సంబంధం ఉన్న ఖ‌లిస్థానీ మ‌ద్ధ‌తుదారులు త‌న‌ను హ‌త్య చేసేందుకు కుట్ర చేస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

త‌న‌తో పాటు పంజాబ్‌లో మ‌రికొంత మంది రాజ‌కీయ నేత‌ల ప్రాణాల‌కు ఖ‌లిస్థానీయుల నుంచి ముప్పు పొంచి ఉంద‌ని తెలిపారు. సోష‌ల్ మీడియాలో లీకైన కొన్ని స్క్రీన్ షాట్ల ద్వారా ఈ విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని మంత్రి చెప్పారు. జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం కింద అమృత్‌పాల్ సింగ్ నిర్బంధం మ‌రో ఏడాది పొడిగించ‌డంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా 'వారిస్ పంజాబ్ దే' నాయ‌కులు క‌క్ష పెంచుకున్నార‌ని ఆరోపించారు. ఈ విష‌యాన్ని కేంద్రం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. 


More Telugu News