నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవ్ .. అదంతా పుకారే: హీరో సంపూ

  • నా భార్య మిషన్ కుడుతుంది 
  • నా పిల్లలు చాలా సింపుల్ 
  • అందువల్లనే ఆ ప్రచారం జరిగింది 
  • అందులో నిజం లేదని చెప్పిన సంపూ

తెలుగు తెరపై హాస్యాన్ని పరిగెత్తించే కథానాయకులలో సంపూర్ణేష్ బాబు ఒకరు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సోదరా' సినిమా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. "హీరోగా 11 ఏళ్లు పూర్తి చేయడం నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ జర్నీ చాలా హ్యాపీగా అనిపిస్తోంది" అని అన్నాడు. 

సినిమాలలో నాకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. దాంతో ఆ క్రేజ్ ను ఎంజాయ్ చేయలేకపోయానని అనిపిస్తూ ఉంటుంది. నా భార్య ఉమారాణి మిషన్ కుడుతుంది. మాకు ఇద్దరు ఆడపిల్లలు. బీటెక్ .. ఇంటర్ చదువుతున్నారు. నరసింహాచారి పిల్లలుగానే వాళ్లు సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకూ నా పేరును బయటికి రానీయరు. నాకు మాదిరిగానే బస్సులలో .. ఆటోలలో కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్లు అలా ఉండటమే నాకు కూడా నచ్చుతుంది" అని చెప్పాడు. 

నేను నాలుగైదేళ్లు తెరపై కనిపించకపోవడం వలన, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాననే ప్రచారం జరిగింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నేను సినిమాలు చేశాను. అయితే అనుకున్న సమయానికి అవి రిలీజ్ కాకపోవడం వలన అలాంటి ప్రచారం జరిగింది. నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు" అని అన్నారు. 


More Telugu News