సీఎస్‌కే ప‌రాజ‌యం... క‌న్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్‌.. వీడియో వైర‌ల్‌!

  • శుక్ర‌వారం చెపాక్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌, సీఎస్‌కే మ్యాచ్
  • చెన్నైను 5 వికెట్ల తేడాతో ఓడించిన హైదరాబాద్ 
  • సీఎస్‌కే ఓడిపోవ‌డంతో హీరోయిన్‌ శ్రుతి హాస‌న్ ఎమోష‌న‌ల్  
  • శ్రుతి క‌న్నీళ్లు తుడుచుకుంటున్న వీడియో నెట్టింట వైర‌ల్
శుక్ర‌వారం చెపాక్ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌)తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) ప‌రాజ‌యం పాలైన విష‌యం తెలిసిందే. సొంత మైదానంలో చెన్నైను 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓడించింది. కాగా, ఈ మ్యాచ్‌కు హీరో అజిత్ కుమార్‌, హీరోయిన్ శ్రుతి హాస‌న్‌తో పాటు ప‌లువురు కోలీవుడ్ స్టార్స్ త‌ర‌లివ‌చ్చారు. 

అయితే, సీఎస్‌కే ఓడిపోవ‌డంతో శ్రుతి హాస‌న్ ఎమోష‌న‌ల్ అయ్యారు. చెన్నై ప‌రాజ‌యం త‌ర్వాత‌ ఆమె క‌న్నీళ్లు పెట్టుకున్నారు. శ్రుతి క‌న్నీళ్లు తుడుచుకుంటున్న వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. స్నేహితుల‌తో క‌లిసి వ‌చ్చిన ఆమె ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో కూర్చొని ఆట‌ను ఆస్వాదించారు. త‌లా ధోనీ బ్యాటింగ్‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న్ను త‌న మొబైల్‌లో ఫొటోలు తీస్తూ ఆనంద‌ప‌డ్డారు. కానీ, చివ‌ర‌కు మ్యాచ్ ఓడ‌టంతో నిరాశ‌చెందారు. శ్రుతి హాస‌న్‌ కంట‌త‌డి పెట్టుకున్నారు. 

అటు చెన్నై సొంత మైదానంలో ఓటమి పాలవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. వారు ఈ ప‌రాజ‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక‌, ఈ ప‌రాజ‌యంతో సీఎస్‌కే దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన‌ట్లే. ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప చెన్నై గ్రూప్ స్టేజీ దాట‌డం అసాధ్యం. మిగిలిన ఐదు మ్యాచుల్లో ఆ జ‌ట్టు భారీ మార్జిన్ల‌తో గెలవాల్సి ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచులాడి 2 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో ఉంది. మ‌రోవైపు ఈ మ్యాచ్ లో విజ‌యంతో ఎస్ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 


More Telugu News