హైదరాబాద్‌లో భూదాన్ కేసు: పాతబస్తీలో ఈడీ సోదాల కలకలం
- హైదరాబాద్ పాతబస్తీ యాకుత్‌పురా, సంతోష్‌నగర్‌లో ఈడీ సోదాలు
- భూదాన్ భూముల కేసు దర్యాప్తులో భాగంగా తనిఖీలు
- సుకూర్, షర్ఫన్ సహా నలుగురి నివాసాలపై ఈడీ దాడులు
- ఈఐపీఎల్ సంస్థకు సుకూర్ బినామీ అని ఈడీ ఆరోపణ
- గతంలో ఈ కేసులో కలెక్టర్, తహసీల్దార్‌ను విచారించిన ఈడీ
భూదాన్ భూముల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఈడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యాకుత్‌పురా, సంతోష్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని నివాసాల్లో ఈ సోదాలు జరిగింది.
భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఈఐపీఎల్ సంస్థ లావాదేవీలపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ సంస్థ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా భూములు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈఐపీఎల్ సంస్థకు సుకూర్ అనే వ్యక్తి బినామీగా వ్యవహరించాడనే అనుమానంతో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుకూర్‌తో పాటు అతని బంధువు షర్ఫన్, మరో ఇద్దరు వ్యక్తుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో భాగంగా ముఖ్యమైన పత్రాలు, లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇదే కేసులో గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్‌ను, మహేశ్వరం తహసీల్దార్‌ను కూడా ఈడీ అధికారులు విచారించారు.