విజయవాడ చేరుకున్న ప్రధాని మోదీ..హెలికాప్టర్ లో అమరావతికి బయల్దేరిన పీఎం

  • తిరువనంతపురం నుంచి విజయవాడకు చేరుకున్న మోదీ
  • స్వాగతం పలికిన అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్
  • అమరావతిలో స్వాగతం పలకనున్న సీఎం, డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పుడే ప్రధాని తిరువనంతపురం నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. భారత ప్రభుత్వ అధికారిక విమానంలో ఆయన విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. 

అనంతరం ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో నేరుగా ఏపీ సచివాలయం లోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వీరంతా సభాస్థలికి చేరుకుంటారు. ప్రధాని రాక సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు అమరావతిలోని సభాస్థలి లక్షలాది మందితో కిక్కిరిసిపోయింది.


More Telugu News