నేను బలవంతంగా సినీ పరిశ్రమను వీడాల్సి వస్తుందేమో: హీరో అజిత్
- నటన నుంచి ఎప్పుడైనా తప్పుకోవచ్చన్న స్టార్ హీరో అజిత్
- జీవితం విలువైనది, ప్రతి క్షణం ఆస్వాదిస్తానన్న స్టార్ హీరో
- అప్పులు తీర్చడం కోసమే సినిమాల్లోకి వచ్చానని స్పష్టం
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ తన రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడైనా చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకోవచ్చని, కొన్నిసార్లు బలవంతంగానైనా నటనకు వీడ్కోలు పలకాల్సిన పరిస్థితి రావొచ్చని అన్నారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
తన రిటైర్మెంట్ ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియదని అజిత్ పేర్కొన్నారు. "నేను నటన నుంచి ఎప్పుడు తప్పుకుంటానో చెప్పలేను. బలవంతంగానైనా సినిమాలను వదిలేయాల్సి రావొచ్చు. నేను దేన్నీ తేలికగా తీసుకోను. ప్రేక్షకులు నా నటనపై ఎప్పుడు ఫిర్యాదు చేస్తారో తెలియదు కదా. బహుశా వాళ్లంతా నన్ను ఆదరిస్తున్న సమయంలోనే నేను వైదొలుగుతానేమో" అని ఆయన వ్యాఖ్యానించారు.
జీవితం ఎంతో విలువైనదని ఈ సందర్భంగా అజిత్ అన్నారు. తాను జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని గుర్తుచేసుకున్నారు. తన స్నేహితులు, బంధువుల్లో కొందరు క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులతో పోరాడుతున్నారని, వారిని చూసినప్పుడు జీవితం విలువ తనకు మరింతగా అర్థమైందని తెలిపారు. "జీవితంలోని ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నాను. సమయాన్ని వృథా చేయకుండా జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాను" అని ఆయన వివరించారు.
తాను అనుకోకుండానే సినీ రంగ ప్రవేశం చేశానని అజిత్ మరోసారి స్పష్టం చేశారు. "మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలుస్తుంది. నేను స్టార్‌గా ఎదగాలని ఇండస్ట్రీకి రాలేదు. నాకున్న అప్పులు తీర్చుకోవడం కోసమే నటుడినయ్యాను. నా మొదటి సినిమా చూస్తే అందులో నా నటన భయంకరంగా ఉంటుంది" అని అంగీకరించారు. తొలినాళ్లలో తన తమిళ ఉచ్చారణ సరిగా లేకపోవడంతో తన పాత్రలకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించేవారని, ఆ యాస గురించి చాలామంది విమర్శించేవారని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ కొందరు తన పాత యాసను అనుకరిస్తారని చెప్పారు. అయితే, ఆ విమర్శలకు తాను కుంగిపోలేదని, వాటిని సవాలుగా తీసుకుని నిజాయితీగా కష్టపడ్డానని అజిత్ తెలిపారు.