సచిన్ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్

  • టీ20ల్లో వేగంగా 2000 పరుగులు చేసిన భారతీయుడిగా సాయి సుదర్శన్ రికార్డు
  • సచిన్ టెండూల్కర్ (59 ఇన్నింగ్స్) రికార్డును 54 ఇన్నింగ్స్‌ల్లో అధిగమణ
  • ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 23 బంతుల్లో 48 పరుగులు చేసిన సుదర్శన్
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును యువ బ్యాటర్ సాయి సుదర్శన్ బద్దలు కొట్టాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన భారతీయ ఆటగాడిగా గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ నిలిచాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ సుదర్శన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ఫామ్‌లో కనిపించిన సుదర్శన్, కేవలం 23 బంతుల్లోనే 9 ఫోర్లతో 48 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని కేవలం 54 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకున్నాడు. గతంలో ఈ రికార్డు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (59 ఇన్నింగ్స్) పేరిట ఉండేది. కాగా, ఓవరాల్‌గా టీ20ల్లో అత్యంత వేగంగా (53 ఇన్నింగ్స్‌ల్లో) ఈ మార్కును అందుకున్న ఆటగాడిగా షాన్ మార్ష్ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.




More Telugu News