తిరుమలలో ఆక్టోపస్ బ‌ల‌గాల‌ తనిఖీలు.. ఇదిగో వీడియో!

  • భార‌త్‌, పాక్ మ‌ధ్య తీవ్ర‌త‌ర‌మైన ఉద్రిక్త‌త ప‌రిస్థితులు
  • ఇరుదేశాలు ఒక‌రిపై ఒక‌రు భీక‌ర‌మైన దాడులు
  • ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల్లో హై అల‌ర్ట్ 
  • తిరుమ‌ల‌లోనూ భ‌ద్ర‌త‌ క‌ట్టుదిట్టం 
  • టీటీడీ హై అల‌ర్ట్ ప్ర‌క‌టించ‌డంతో ఇవాళ‌ ఆక్టోప‌స్ బ‌ల‌గాల ముమ్మ‌ర త‌నిఖీలు
భార‌త్‌, పాక్ మ‌ధ్య తీవ్ర‌ ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇరుదేశాలు ఒక‌రిపై ఒక‌రు భీక‌ర‌మైన దాడుల‌కు దిగాయి. దాయాది దేశం స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని డ్రోన్‌, క్షిప‌ణి దాడుల‌కు పాల్ప‌డుతోంది. భార‌త బ‌ల‌గాలు దీటుగా స్పందిస్తూ వాటిని కూల్చివేస్తున్నాయి. స‌రిహ‌ద్దు రాష్ట్రాలైన‌ జ‌మ్మూక‌శ్మీర్‌, రాజ‌స్థాన్‌, పంజాబ్‌ల‌లో ప‌లు ప్రాంతాల‌ను టార్గెట్ చేసి, పాక్ దాడులు నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల్లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 

ఈ క్ర‌మంలో తిరుమ‌ల‌లోనూ భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. తిరుమ‌ల‌లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించ‌డంతో శ‌నివారం ఆక్టోప‌స్ బ‌ల‌గాలు ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హించాయి. తిరుమ‌ల శ్రీనివాసుడి ఆల‌యంతో పాటు వాహ‌నాలు, భ‌క్తులు తిరిగే ప్రాంతాల్లో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, డాగ్ స్క్వాడ్‌, బాంబ్ స్క్వాడ్‌ల‌తో క‌లిసి ఆక్టోప‌స్ బ‌ల‌గాలు సోదాలు నిర్వ‌హించాయి. ఈ సంద‌ర్భంగా భ‌క్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆల‌య సిబ్బంది సూచించారు. ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు ధైర్యంగా, సిద్ధంగా ఉండాల‌ని కోరారు. 


More Telugu News