ఆపరేషన్ సిందూర్: ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసిన భారత టెక్ సత్తా
- ఇటీవల పాక్ పై ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్
- పాక్ గగనతల రక్షణను ఛేదించి ఉగ్ర స్థావరాలపై విజయవంతమైన దాడులు
- కీలకపాత్ర పోషించిన స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, దేశీయ తయారీ ఆయుధాలు
భారత రక్షణ రంగ స్వదేశీ పరిజ్ఞానం మరోసారి తన సత్తా చాటింది. పాకిస్థాన్ దుందుడుకు చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా, శత్రు భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై విజయవంతమైన దాడులు నిర్వహించడంలో దేశీయంగా అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థలు కీలక పాత్ర పోషించాయి. ఈ పరిణామాలు భారత సాంకేతిక సామర్థ్యానికి, వ్యూహాత్మక ప్రణాళికకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
పాక్ గగనతల రక్షణ ఛేదనలో భారత నైపుణ్యం
మే 7న, కేవలం 23 నిమిషాల వ్యవధిలో, భారత వాయుసేన (ఐఏఎఫ్) పాకిస్థాన్ వద్ద ఉన్న చైనా తయారీ గగనతల రక్షణ (ఏడీ) వ్యవస్థలను ఏమార్చి, వాటిని పనిచేయకుండా జామ్ చేసి, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ హెచ్‌క్యూ-9 క్షిపణి బ్యాటరీలు, రాడార్ వ్యవస్థలు భారత దాడిని పసిగట్టడంలో విఫలమయ్యాయి. ఇది భారత ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్ర నైపుణ్యానికి, సాంకేతిక ఆధిక్యతకు నిదర్శనమని ప్రభుత్వం ప్రకటించింది.
శత్రు దాడుల తిప్పికొట్టడంలో స్వదేశీ వ్యవస్థల విజయం
గత వారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య, పాకిస్థాన్ ప్రతీకారంగా ప్రయోగించిన పలు క్షిపణులు, డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా నిర్వీర్యం చేసింది. చైనా తయారీ పీఎల్-15 క్షిపణులు, టర్కీ మూలాలున్న బైకర్ యిహా కమికాజే డ్రోన్లు, అసిస్‌గార్డ్ సోంగర్ డ్రోన్ల వంటి అత్యాధునిక విదేశీ ఆయుధాలను పాక్ ప్రయోగించినప్పటికీ, భారత స్వదేశీ గగనతల రక్షణ నెట్‌వర్క్ ముందు అవి దిగదుడుపే అయ్యాయి.
ఆపరేషన్ సింధూర్: స్వదేశీ సాంకేతికతకు పెద్ద పీట
'ఆపరేషన్ సింధూర్'లో భాగంగా, ఐఏఎఫ్ యొక్క పూర్తిస్థాయి ఆటోమేటెడ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (ఐఏసీసీఎస్), ఆర్మీకి చెందిన 'ఆకాశ్‌తీర్' వ్యవస్థలు కీలకపాత్ర పోషించాయి. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) అభివృద్ధి చేసిన ఆకాశ్‌తీర్, వివిధ రాడార్లను, గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థలను అనుసంధానించి, గగనతల వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు అందించింది. "ఆకాశ్‌తీర్ వ్యవస్థ వినియోగదారుల అంచనాలను మించి పనిచేసి, ప్రస్తుత ఘర్షణ సమయంలో భారత్‌కు పటిష్టమైన వాయు రక్షణ కల్పించింది" అని బీఈఎల్ 'ఎక్స్' లో పేర్కొంది.
ఆకాశ్ అదుర్స్
ఈ బహుళ అంచెల రక్షణ కవచంలో స్వదేశీ 'ఆకాశ్' క్షిపణి వ్యవస్థ (25 కి.మీ. పరిధి) ప్రముఖ పాత్ర పోషించింది. దీనితో పాటు రష్యాకు చెందిన ఎస్-400 'ట్రయంఫ్', ఇజ్రాయెల్‌తో సంయుక్తంగా అభివృద్ధి చేసిన బరాక్-8, పెచోరా క్షిపణులు, ఎల్-70 గన్‌లు, ఇగ్లా-ఎస్ క్షిపణులు, సమీకృత డ్రోన్ గుర్తింపు, నిరోధక వ్యవస్థలు కూడా ఈ నెట్‌వర్క్‌లో భాగమే. ఈ స్వదేశీ, విదేశీ వ్యవస్థల సమన్వయం మే 9, 10 తేదీలలో పాక్ వాయుసేన దాడుల నుంచి భారత వైమానిక స్థావరాలు, లాజిస్టిక్ కేంద్రాలను కాపాడటంలో విజయవంతమైంది. ఇస్రోకు చెందిన కనీసం 10 ఉపగ్రహాలు కూడా నిరంతర పర్యవేక్షణలో పాలుపంచుకున్నాయి.
కచ్చితమైన దాడులు, స్వదేశీ ఆయుధాల వినియోగం
కాల్పుల విరమణకు ముందు, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది వైమానిక స్థావరాలు, రాడార్ సైట్లపై భారత్ కచ్చితమైన దాడులు చేసింది. ఇందులో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, ఇతర సుదూర శ్రేణి స్వదేశీ గైడెడ్ ఆయుధాలు, డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఈ దాడులన్నీ భారత ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, అత్యంత ప్రభావవంతంగా, రాజకీయంగా సమతుల్యంగా జరిగాయని ప్రభుత్వ ప్రకటన వివరించింది.
రక్షణ స్వదేశీకరణకు లభించిన ధృవీకరణ
'ఆపరేషన్ సిందూర్' కేవలం వ్యూహాత్మక విజయమే కాదు, భారత రక్షణ స్వదేశీకరణ విధానాలకు లభించిన గొప్ప ధృవీకరణ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గగనతల రక్షణ వ్యవస్థలు మొదలుకుని... డ్రోన్లు, కౌంటర్-యూఏఎస్ సామర్థ్యాల నుంచి నెట్-సెంట్రిక్ యుద్ధ తంత్ర వేదికల వరకు, ప్రతిచోటా స్వదేశీ సాంకేతికత తన సత్తా చాటింది. అరాచక యుద్ధ రీతికి ఇది ఒక బ్యాలెన్స్ డ్ సైనిక ప్రతిస్పందన అని, భారత్ తన సొంత ఆవిష్కరణలు, దృఢమైన ప్రభుత్వ మద్దతు, స్వదేశీ ప్రజల ప్రతిభతో ఎలాంటి సవాల్‌కైనా సన్నద్ధంగా ఉందని ఈ ఆపరేషన్ నిరూపించింది.