భగవంత్ కేసరి మూవీకి విజయ్ జననాయగన్ రిమేక్ కాదా..!
- విజయ్ చివరి మూవీగా జననాయగన్
- ఇది బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్ అంటూ ప్రచారం
- ఒక ఎపిసోడ్ మినహా జగనాయగన్ మూవీకి భగవంత్ కేసరితో ఎలాంటి సంబంధం లేదని సమాచారం
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ పొందింది. ఈ సినిమాను తమిళంలో పునర్నిర్మిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై హెచ్. వినోద్ దర్శకత్వంలో ‘జననాయగన్’ పేరుతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
విజయ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇది ఆయనకు చివరి సినిమా అని భావిస్తున్నారు. ఎందుకంటే విజయ్ ఇప్పటికే తమిళనాడులో రాజకీయ పార్టీని స్థాపించి రాబోయే ఎన్నికల్లో తన సత్తా చాటాలని యోచిస్తున్నారు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
అయితే, అందరూ భావిస్తున్నట్లుగా ‘జననాయగన్’, భగవంత్ కేసరి రీమేక్ కాదని తెలుస్తోంది. భగవంత్ కేసరిలోని గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఎపిసోడ్ విజయ్‌ను ఆకట్టుకుందని, ఆ కారణంగానే ఆ సన్నివేశాన్ని ఉపయోగించుకునేందుకు నిర్మాత సాహుకి నాలుగున్నర కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఆ ఒక్క ఎపిసోడ్ మినహా ‘జననాయగన్’ చిత్రానికి భగవంత్ కేసరితో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.