బిట్ కాయిన్ పాస్ వర్డ్ కోసం... ఎంత దారుణం!
- బిట్‌కాయిన్ పాస్‌వర్డ్ కోసం ఇటలీ వ్యక్తి కిడ్నాప్, చిత్రహింసలు
- నిందితుడు అమెరికాకు చెందిన క్రిప్టో కోటీశ్వరుడు జాన్ వోల్ట్జ్
- న్యూయార్క్‌లోని విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో ఈ దారుణం
- బాధితుడిని కరెంటు వైర్లతో కట్టి, టేజర్‌తో షాక్, చైన్‌సాతో దాడి
- నిందితుడు జాన్ వోల్ట్జ్‌కు బెయిల్ నిరాకరణ, 25 ఏళ్ల వరకు జైలు శిక్ష?
- అపార్ట్‌మెంట్‌లో తుపాకులు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు స్వాధీనం
బిట్‌కాయిన్ పాస్‌వర్డ్ కోసం ఓ ఇటాలియన్ క్రిప్టో వ్యాపారిని కిడ్నాప్ చేసి, విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో బంధించి, చిత్రహింసలకు గురిచేసిన ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కెంటికీకి చెందిన క్రిప్టో మిలియనీర్ జాన్ వోల్ట్జ్ (37)ను పోలీసులు అరెస్టు చేశారు. అతనికి కోర్టు బెయిల్ నిరాకరించి, జైలుకు పంపింది. ఈ కేసులో వోల్ట్జ్‌కు 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, ఇటలీలోని ట్యూరిన్‌కు చెందిన మైఖేల్ వాలెంటినో టియోఫ్రాస్టో కార్టురాన్ (28) అనే క్రిప్టో వ్యాపారి పర్యాటకం, భాషా అధ్యయనం కోసం మే 6న అమెరికాకు వచ్చాడు. దాదాపు 30 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులున్న కార్టురాన్, న్యూయార్క్‌లోని సోహో ప్రాంతంలో ప్రిన్స్ స్ట్రీట్‌లోని ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాడు. అయితే, అక్కడ అతనికి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి.
ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం, ఆ అపార్ట్‌మెంట్‌ను 'క్రిప్టో కమ్యూన్'గా మార్చేసిన జాన్ వోల్ట్జ్, కార్టురాన్‌ను నిర్బంధించాడు. అక్కడ స్ట్రిప్పర్ పోల్స్, ఖరీదైన క్రిస్టల్ షాంపేన్ కేసులు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. కార్టురాన్ వద్ద ఉన్న క్రిప్టో సంపదను కాజేయాలనే దురుద్దేశంతో, అతని బిట్‌కాయిన్ పాస్‌వర్డ్ చెప్పాలంటూ వోల్ట్జ్ చిత్రహింసలకు గురిచేశాడు. బాధితుడిని కరెంటు వైర్లతో కుర్చీకి కట్టేసి, కాళ్లను నీటిలో ఉంచి టేజర్‌తో షాక్ ఇచ్చాడు. అతనిపై మూత్ర విసర్జన చేయడమే కాకుండా, బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి, కాళ్లు, చేతులపై చైన్‌సాతో కోశాడని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, కార్టురాన్ మెడకు యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌ను కూడా కట్టాడు.
ఈ అఘాయిత్యం గురించి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీ మైఖేల్ మాట్సన్ కోర్టుకు వివరిస్తూ, "వోల్ట్జ్ ఒకానొక సమయంలో బాధితుడిని అపార్ట్‌మెంట్‌లోని మెట్ల పైకి తీసుకెళ్లి, రెయిలింగ్‌పై నుంచి కిందకు వేలాడదీశాడు. బిట్‌కాయిన్ పాస్‌వర్డ్ చెప్పకపోతే చంపేస్తానని బెదిరించాడు" అని తెలిపారు.
శుక్రవారం ఉదయం, కార్టురాన్ చాకచక్యంగా తప్పించుకోగలిగాడు. పాస్‌వర్డ్‌ను తన ల్యాప్‌టాప్‌లో ఎంటర్ చేయాలని వోల్ట్జ్‌కు చెప్పి, అతను పక్కకు తిరిగిన వెంటనే, రక్తమోడుతున్న కాళ్లతో, చెప్పులు లేకుండా మెట్లపై నుంచి కిందకు పరుగెత్తి, వీధిలో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసును ఆశ్రయించాడు. తీవ్ర గాయాలతో ఉన్న కార్టురాన్‌ను పోలీసులు బెల్లీవ్యూ ఆసుపత్రికి తరలించారు. అతని చేతిపై చైన్‌సా గాయం, తలపై తుపాకీతో కొట్టిన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ఘటనా స్థలంలో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. కార్టురాన్ తలకు తుపాకీ గురిపెట్టి, క్రాక్ కొకైన్ తాగుతున్నట్లు ఉన్న పోలరాయిడ్ ఫోటోలు, నైట్ విజన్ కళ్లజోళ్లు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్, బాలిస్టిక్ హెల్మెట్లు, తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో తొలుత వోల్ట్జ్ సహాయకురాలు బీట్రైస్ ఫోల్చీని అరెస్టు చేసినప్పటికీ, ప్రాసిక్యూటర్లు వెంటనే అభియోగాలు మోపకపోవడంతో ఆమెను విడుదల చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.