భార‌త్‌లో యాపిల్ మూడో స్టోర్.. ఎక్క‌డో తెలుసా?

  • క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో యాపిల్ మూడో స్టోర్‌
  • హెబ్బాల్‌లోని ఫీనిక్స్ మాల్‌లో కొత్త స్టోర్‌ ఏర్పాటు
  • ఇప్ప‌టికే ఢిల్లీ, ముంబ‌యి న‌గ‌రాల‌లో యాపిల్‌కు స్టోర్లు
టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీదారు యాపిల్ భార‌త్‌లో త‌న మూడో స్టోర్‌ను ప్రార‌భించ‌నుంది. దీనికోసం క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరును ఎంచుకుంది. హెబ్బాల్‌లోని ఫీనిక్స్ మాల్‌లో కొత్త స్టోర్‌ను ఏర్పాటు చేయ‌నుంది.  ఇక‌, ఇప్ప‌టికే ఢిల్లీ, ముంబ‌యి న‌గ‌రాల‌లో ఉన్న స్టోర్లకు వ‌చ్చిన ఆద‌ర‌ణ‌తో విస్త‌ర‌ణ దిశ‌గా అడుగులేస్తోంది. సొంత రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేస్తూ త‌న ఉత్పత్తులను విక్రయిస్తోంది.

బెంగ‌ళూరు ఫీనిక్స్ మాల్ మొద‌టి అంత‌స్తులో 8వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో యాపిల్ ఈ స్టోర్‌ను ఏర్పాటు చేయ‌నుంది. ఈ స్థలాన్ని యాపిల్ ప‌దేళ్ల పాటు లీజుకు తీసుకున్న‌ట్లు స‌మాచారం. రానున్న కొన్ని నెల‌ల్లోనే ఈ స్టోర్ ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. ఢిల్లీలోని ఔట్‌లెట్ మాదిరిగానే ఈ స్టోర్ ఉండ‌నుంది. 

కాగా, భార‌త్‌లో వ్యాపార వృద్ధికి ఇంకా భారీ అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఇటీవ‌ల యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే దేశంలో మ‌రో నాలుగు యాపిల్‌ స్టోర్ల‌ను ఏర్పాటు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 

ఇదిలాఉంటే... యాపిల్ గ్లోబ‌ల్ వ్యూహంలో భార‌త్ కీల‌కంగా మారింది. విక్ర‌యాల‌కు మాత్ర‌మే కాకుండా ఉత్ప‌త్తి కేంద్రంగా ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. 


More Telugu News