కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్టుపై అంబ‌టి రాంబాబు ఏమ‌న్నారంటే..!

   
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. కాగా, కొమ్మినేని అరెస్టుపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా స్పందించారు. "కొమ్మినేని క‌మ్మ కుల‌స్థుడ‌యినా త‌న‌ను విమ‌ర్శిస్తున్నార‌ని చంద్ర‌బాబుకు క‌క్ష" అంటూ అంబ‌టి ట్వీట్ చేశారు. దీనిని సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేశారు. 

ఇక‌, ఏపీ పోలీసులు హైద‌రాబాద్‌లోని జ‌ర్న‌లిస్టు కాల‌నీలో ఆయన నివాసంలో  అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం హైద‌రాబాద్ నుంచి ఆయ‌న‌ను విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నారు. ఓ టీవీలో కొమ్మినేని నిర్వ‌హించిన డిబేట్‌లో జ‌ర్న‌లిస్టు కృష్ణంరాజు అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచార‌నే అభియోగాల‌తో కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. 

ఇదే కేసులో కొమ్మినేని శ్రీ‌నివాస‌రావును అరెస్టు చేశారు. ఏపీ మాదిగ కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేయ‌డం జ‌రిగింది. జ‌ర్న‌లిస్టు కృష్ణంరాజు, కొమ్మినేనితో పాటు సాక్షి టీవీ యాజ‌మాన్యంపై కేసు న‌మోదు అయింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇత‌ర సెక్ష‌న్ల కింద ఏపీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. కొమ్మినేని శ్రీనివాస‌రావును మ‌ధ్యాహ్నం కోర్టులో ప్రవేశ‌పెట్టేందుకు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నారు. 


More Telugu News