సంగారెడ్డి రామ్ మందిర్‌లో జగ్గారెడ్డి భక్తి పారవశ్యం.. డోలు వాయిస్తూ కీర్తనలు!

  • సంగారెడ్డి రామ్ మందిర్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
  • భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
  • స్వయంగా డోలు వాయించి అందరినీ ఆకట్టుకున్న వైనం
  • కీర్తనలకు అనుగుణంగా డోలుతో సందడి చేసిన జగ్గారెడ్డి
నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయ వ్యవహారాలతో నిమగ్నమయ్యే సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి... సంగారెడ్డి పట్టణంలోని ప్రఖ్యాత రామాలయంలో జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన భక్తి పారవశ్యంలో ఓలలాడారు. ఆలయంలో భజన బృందాలు ఆలపిస్తున్న కీర్తనలకు అనుగుణంగా జగ్గారెడ్డి స్వయంగా డోలు వాయించడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. ఎంతో ఉత్సాహంగా, లయబద్ధంగా డోలు వాయిస్తూ భజన బృందంతో కలిసిపోయారు. ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

ఆయన డోలు వాయిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆయన అభిమానులు ఈ వీడియోను 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. "ఇది ఒక ప్రజానాయకుడి భక్తి రూపం! సంగారెడ్డి రామ్ మందిర్‌లో భక్తి గీతాల మధ్య... భక్తి, వినయం, మనస్పూర్తి... ఇది రాజకీయాలకు అతీతమైన మానవత్వం!" అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.


More Telugu News