కొల్లేరు సరస్సును కాలుష్యం కోరలనుండి కాపాడుకోవాలి

  • అధికారులతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా. పి. క్రిష్ణయ్య సమీక్ష
  • కొల్లేరులో వ్యర్ధాలు వేయకుండా, పరిశ్రమల మురుగు నీరు వదలకుండా చర్యలు చేపట్టాలన్న కృష్ణయ్య
  • పరీవాహక ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయించడంతో పాటు, అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని ఆదేశం 
కొల్లేరు సరస్సును కాలుష్య కోరల్లోంచి కాపాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య అన్నారు. డివిజనల్ అటవీ శాఖ, కృష్ణా, ఏలూరు, గుడివాడ జిల్లాల పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులు, పీసీబీ మెంబర్ సెక్రటరీ శరవణన్‌తో కలిసి ఆయన విజయవాడలోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు.

చుట్టుపక్కల గ్రామాల వారు కొల్లేరులో వ్యర్థాలు వేయకుండా, పరిశ్రమల నుంచి మురుగు నీరు వదలకుండా ఆయా శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కొల్లేరు పరీవాహక ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయించడంతో పాటు, అధికారుల బృందాన్ని ఆ ప్రాంతానికి పంపి అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించారు.

అలానే కొల్లేరులో ఎక్కడెక్కడి నుంచి డ్రెయిన్స్ వచ్చి కలుస్తున్నాయో గుర్తించాలని, తక్షణమే వాటిని శుద్ధి చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కొల్లేరు పరీవాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే అందుకు సంబంధించిన మెకానిజంతో కాలుష్య వ్యర్థాలను తొలగించమని ఆయన సూచించారు. 


More Telugu News