కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు.. విమానంలోపలి విజువల్స్ ఇవిగో!

  • అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదం
  • లండన్ వెళుతుండగా టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలిన వైనం
  • విమానంలోని 242 మంది ప్రయాణికులు, సిబ్బంది
  • మేఘనీనగర్ జనవాసాలపై పడిన విమానం, భవనాలు ధ్వంసం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. లండన్ వెళుతున్న ఆ విమానం నగరంలోని జనసాంద్రత అధికంగా ఉండే నివాస, కార్యాలయ సముదాయాలపై పడటంతో తీవ్ర ఆస్తినష్టం సంభవించింది, స్థానికులు కూడా మరణించి ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, ఈ విమానం గాల్లోకి లేచిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. విమానంలో అప్పటివరకు ఎంతో ఉల్లాసంగా ఉన్న వాతావరణం, కొన్ని సెకన్లలోనే భయానకంగా మారిపోయింది. ప్రయాణికులు హాహాకారాలు చేస్తుండగానే విమానం కుప్పకూలడం, మంటల్లో చిక్కుకోవడం ఓ వీడియోలో కనిపించింది. 

ఎయిరిండియాకు చెందిన ఏఐ171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానాశ్రయ పరిసర ప్రాంతాలకు సమీపంలో ఉన్న మేఘనీనగర్‌లోని జనవాసాలపై కూలిపోయింది. చెట్ల వెనుక విమానం మాయమై, వెంటనే భారీ పేలుడు సంభవించిందని, దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగలు కనిపించడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.



More Telugu News