మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
- మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
- అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్
- గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అరుణ, అంజు అనే ముగ్గురు మావోలు మృతి
మావోస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇవాళ తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చింతకూలు, కొయ్యలగూడెం, కొండమొదలు పరిసర అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, మావోల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు.
ఇందులో సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు, ఇటీవల మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణతో పాటు మరో మావోయిస్టు అంజు ఉన్నారు. ఘటనాస్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
మరి కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.