ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే.. సచ్చిందాకా సాకుతా అన్నాడట: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి కేటీఆర్ విమర్శలు
- పదవుల మీద ఉన్న ధ్యాస.. తెలంగాణ ప్రజలపై లేదంటూ ధ్వజం
- ఎన్నికల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్న మాజీ మంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదవుల మీద ఉన్న ధ్యాస.. తెలంగాణ ప్రజలపై లేదంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే.. సచ్చిందాక సాకుతా అన్నాడట.. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరు ఉందని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు.
"ఏస్తున్న రైతుభరోసా సరే. మరి ఎగ్గొట్టిన రైతుభరోసా సంగతి ఏంది..? ఎగ్గొట్టిన వడ్ల బోనస్ సంగతి ఏంది..? ఎగ్గొట్టిన తులం బంగారం, కళ్యాణలక్ష్మి పరిస్థితి ఏంటి..? ఎగ్గొట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పరిస్థితి ఏంటి..? ఎగ్గొట్టిన రూ.2500 మహాలక్ష్మి పథకం పరిస్థితి ఏంటి..? ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ స్కూటీల పరిస్థితి ఏంటి..? ఆగిపోయిన రైతుబీమా పరిస్థితి ఏంటి..? ఆగిపోయిన రుణమాఫీ పరిస్థితి ఏంటి..?" అని కేటీఆర్ నిలదీశారు.
శాసనసభ ఎన్నికల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి, లోక్‌సభ ఎన్నికల కోసం దేవుళ్ల మీద ఒట్లేసి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతుభరోసా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కుటిల యత్నాలను తెలంగాణ గమనిస్తుంది. మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ద.. తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన గ్యారంటీ కార్డు అమలుపై లేకపాయే అని కేటీఆర్ ట్వీట్ చేశారు.