సెల్‌ఫోన్ అప్పగించాలన్న ఏసీబీ నోటీసులపై స్పందించిన కేటీఆర్

  • ఏసీబీ నోటీసుపై స్పందించిన కేటీఆర్
  • సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనంపై తీవ్ర అభ్యంతరం
  • ప్రాథమిక హక్కులు, గోప్యతకు భంగమంటూ లేఖ
  • సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన మాజీ మంత్రి
ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించి తన సెల్‌ఫోన్‌ను అప్పగించాలంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జారీ చేసిన నోటీసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఏసీబీ అధికారులకు ఒక లేఖ రాశారు. ఫార్ములా-ఈ కార్ రేసు నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ విచారణ జరుపుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే కేటీఆర్‌ను కూడా అధికారులు విచారిస్తున్నారు.

విచారణలో భాగంగా కేటీఆర్ వాడుతున్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను తమకు అందజేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అయితే, తన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవాలని కోరడం ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని కేటీఆర్ తన లేఖలో స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో నొక్కి చెప్పిందని ఆయన గుర్తు చేశారు.

ఏసీబీ అధికారుల ఆదేశాలపై కేటీఆర్ తన న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ ఫోన్‌ను గానీ, ల్యాప్‌టాప్‌ను గానీ ఏసీబీకి అప్పగించాల్సిన అవసరం లేదని న్యాయనిపుణులు కేటీఆర్‌కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ న్యాయ సలహా మేరకే కేటీఆర్ ఏసీబీకి లేఖ ద్వారా తన నిర్ణయాన్ని తెలియజేశారు.ె


More Telugu News