అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆసుపత్రికి తరలింపు
- క్వారీ యజమానిని బెదిరించిన కేసులో కౌశిక్ పై కేసు నమోదు
- సుబేదారి పీఎస్ లో కేసు నమోదు
- వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలింపు
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత... గులాబీ పార్టీలో ప్రాధాన్యతలు ఎంతో మారిపోయాయి. గత పదేళ్లుగా ఆ పార్టీలో పెద్ద లీడర్లుగా చెలామణి అయిన వారు కనుమరుగయ్యారు. తాజాగా... ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లాంటి యంగ్ లీడర్లు తెరపైకి వచ్చారు. అయితే, ఒక క్వారీ యజమానిని డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలతో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదయింది. క్వారీ యజమానిని బెదిరించారనే ఆరోపణలతో ఆయనను సుబేదారి పీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.