భర్తతో గొడవ .. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

  • భర్తతో మనస్పర్థల కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణం
  • హైదరాబాద్ చందానగర్‌లో ఘటన
మహారాష్ట్రకు చెందిన దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. అయితే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని చందానగర్ పరిధిలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన అరుణ (30)కు అదే రాష్ట్రానికి చెందిన నిలేష్ పాటిల్‌తో 2023లో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా వీరు హైదరాబాద్ లోని నల్లగండ్ల ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

భర్తతో తరచూ గొడవలు జరుగుతుండటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అరుణ తన గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్తతో మనస్పర్థల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 


More Telugu News