మృతుల సంఖ్యపై సిగాచి అధికారిక ప్రకటన

  • 90 రోజుల పాటు కంపెనీ మూసివేత
  • బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ
  • పేలుడుకు రియాక్టర్ కారణం కాదన్న కంపెనీ సెక్రటరీ
పాశమైలారంలోని తమ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో 40 మంది కార్మికులు, సిబ్బంది చనిపోయారని సిగాచి కంపెనీ అధికారికంగా ప్రకటించింది. పేలుడు ఘటనలో 33 మంది గాయపడ్డారని, వారిని వివిధ ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కంపెనీ ఈ ప్రకటనలో హామీ ఇచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని తెలిపింది.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ రోజు ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంపై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి ఆయన లేఖ రాశారు. ఈ ఘటనకు రియాక్టర్‌ పేలుడు కారణం కాదని తెలిపారు. ప్రభుత్వ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సిగాచి పాశమైలారం ప్లాంటును 90 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు.


More Telugu News