తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

  • పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • రుతుపవన ద్రోణి ప్రభావంతో వానలు
  • పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
  • గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు
తెలంగాణ రాష్ట్రంలో వర్ష సూచనలు ఉన్నాయి. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వాతావరణ శాఖ అంచనా ప్రకారం గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.


More Telugu News