రఘునందన్ రావును పరామర్శించిన బండి సంజయ్

  • ఇటీవల రఘునందన్ రావు కాలికి శస్త్ర చికిత్స
  • ఎంపీ ఇంట్లో పరామర్శించిన కేంద్రమంత్రి
  • ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న బండి సంజయ్
బీజేపీ నేత, మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావును కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఇటీవల రఘునందన్ రావు కాలికి శస్త్ర చికిత్స జరిగింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో బండి సంజయ్ గురువారం రఘునందన్ రావు ఇంటికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

రఘునందన్ రావును తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో పరామర్శించారు. పఠాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా ఆయనను నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో పరామర్శించారు.


More Telugu News