మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం
- విమానాశ్రయంలో స్వాగతం పలికిన సీఎం సహా పలువురు నాయకులు
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో పాల్గొననున్న ఖర్గే
- రేపటి బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఖర్గే
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆయన ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు.
రేపు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతారు.
రాజ్ నాథ్ కూడా హైదరాబాదులో పర్యటన!
ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ రేపు హైదరాబాద్ రానున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారు.