కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: అసదుద్దీన్ ఒవైసీ

  • 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన అసదుద్దీన్ ఒవైసీ
  • కేసీఆర్ గారూ.. త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్
  • ఆసుపత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన కవిత
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ట్వీట్ చేశారు.

రెండు రోజుల క్రితం స్వల్ప అస్వస్థత కారణంగా కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన త్వరగా కోలుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తదితరులు ఆకాంక్షించారు. వైద్యులకు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారు.

పరామర్శించిన కవిత

కొంతకాలంగా తండ్రితో దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతకుముందు చెప్పారు.


More Telugu News