స్వర్ణాంధ్ర పీ-4 లోగోను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు
- స్వర్ణాంధ్ర పీ -4పై సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు
- పీ -4 అమలుకు రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం
- పీ 4 వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదన్న సీఎం
స్వర్ణాంధ్ర పీ-4 లోగోను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. స్వర్ణాంధ్ర - పీ4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో శుక్రవారం జరిగింది. జూమ్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో పీ4 పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
పీ4 అమలు, పర్యవేక్షణ కొరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో చాప్టర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కమిటీల్లో ఇన్‍ఛార్జి మంత్రులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సభ్యులుగా ఉంటారని చెప్పారు.
పీ4 అమలులో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు, లక్ష మంది మార్గదర్శులను గుర్తించాలని నేతలు, అధికారులకు చంద్రబాబు సూచించారు.
అయితే, ఈ పథకం అమలుపై ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ఆయన ఆ అనుమానాలను నివృత్తి చేశారు. పీ4 వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని స్పష్టం చేశారు. ఇది సంక్షేమానికి అదనమని తెలిపారు. పీ4 పథకంపై ప్రజల్లో ఉన్న అపోహలను నేతలు, అధికారులు తొలగించాలని సూచించారు. బంగారు కుటుంబాలకు సరైన సమయంలో సహకారం, నిరంతర గైడెన్స్ ఇవ్వడం మార్గదర్శుల బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు.