తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణ

  • తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన ఎన్. రామచందర్‌రావు
  • హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ
  • గజమాలతో రామచందర్‌రావుకు ఘన సత్కారం
  • బాధ్యతల స్వీకరణకు ముందు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్. రామచందర్‌రావు శనివారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు, ఆయన్ను గజమాలతో ఘనంగా సత్కరించారు.

అంతకుముందు రామచందర్‌రావు తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సరస్వతీ దేవి ఆలయంలో, చారిత్రక చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకున్నారు.


More Telugu News