అమెరికా విమానంలో తోటి ప్రయాణికుడిపై భారత సంతతి యువకుడి దాడి
- అమెరికా విమానంలో తోటి ప్రయాణికుడిపై దాడి
- భారత మూలాలున్న యువకుడి వీరంగం
- పిడిగుద్దులు కురిపించి, మెడ పట్టుకుని ఘర్షణ
- సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియో
- నిందితుడు ఇషాన్ శర్మను అరెస్ట్ చేసిన పోలీసులు
- 500 డాలర్ల జరిమానా విధింపు
అమెరికాలో విమాన ప్రయాణంలో భారత సంతతికి చెందిన యువకుడు ఒకర దురుసుగా ప్రవర్తించారు. తోటి ప్రయాణికుడిపై ఎటువంటి కారణం లేకుండా దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
న్యూయార్క్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఇషాన్ (21) అనే యువకుడు గత నెల 30న ఫిలాకెంప్లియా నుండి మయామీకి విమానంలో ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో కెయాను ఎవాన్స్ అనే తోటి ప్రయాణికుడితో అతనికి వాగ్వాదం జరిగింది. అది తీవ్ర ఘర్షణకు దారితీసింది.
ఎవాన్స్‌పై ఇషాన్ శర్మ పిడిగుద్దులతో దాడి చేశాడు. ఇద్దరూ ఒకరి మెడను మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. గొడవను ఆపాలని తోటి ప్రయాణికులు ఎంతగానో ప్రయత్నించినా వారు వినలేదు. ఈ ఘర్షణను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
విమానం మయామిలో దిగిన తర్వాత పోలీసులు సోమవారం ఇషాన్ శర్మను అరెస్ట్ చేశారు. అతనికి 500 డాలర్ల జరిమానా విధించారు. ఈ ఘటనపై ఎవాన్స్ మాట్లాడుతూ, తాను కేటాయించిన సీటు వద్దకు వెళుతుండగా ఇషాన్ తనపై ఎటువంటి కారణం లేకుండా దాడి చేశాడని, తాను అతడిని రెచ్చగొట్టేలా ఏమాత్రం ప్రవర్తించలేదని పోలీసులకు తెలియజేశాడు.