venkatesh: వెంకీ కోసం అనుకున్న సాంగ్ రానాకి సెట్ అయింది : తేజ
కొంత గ్యాప్ తరువాత తేజ తెరకెక్కించిన 'నేనే రాజు నేనే మంత్రి' హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో జోగేంద్ర పాత్రను చేసిన రానాను చాలామంది "జోగేంద్ర" అనే పిలుస్తూ ఉండటం విశేషం. అంతగా ఆ పాత్ర ప్రేక్షకులను ప్రభావితం చేసింది. ఈ సినిమాలో "జోగేంద్ర .. జోగేంద్ర .. "అనే సాంగ్ వుంది. ఈ పాట ఆడియన్స్ కి తెగ నచ్చేసింది .. ఆ పాత్ర పట్ల వాళ్లకి గల ఇష్టాన్ని మరింత పెంచింది.
అలాంటి ఈ పాటను కొంతకాలం క్రితం వెంకటేశ్ కోసం అనుకోవడం జరిగిందని తేజ అన్నారు. వెంకటేశ్ తో ఏడేళ్ల క్రితం 'సావిత్రి' అనే సినిమా చేయాలనుకున్నామనీ, కానీ కొన్ని కారణాల వలన అది పట్టాలెక్కలేదని చెప్పారు. ఆ సినిమా కోసం అనూప్ రూబెన్స్ చేసిన ఈ పాట, 'నేనే రాజు నేనే మంత్రి' లో సందర్భానికి తగినట్టుగా కరెక్ట్ గా సెట్ అయిందని అన్నారు. ఈ పాటకి ప్రేక్షకులు పడుతోన్న నీరాజనాలే అందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు.