pavan: స్నేహాన్ని పవన్ తొందరగా వదులుకునే వ్యక్తి కాదు!
పవన్ కల్యాణ్ తో పరిచయమైనవాళ్లు చాలామంది ఆయనలోని ప్రత్యేక గుణాలను గురించి ఏదో ఒక సందర్భంలో ప్రస్తావిస్తూనే వుంటారు. అలా పవన్ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడిన ఆయన స్నేహితులలో నిర్మాత శరత్ మరార్ ఒకరు. 'సర్దార్ గబ్బర్ సింగ్' నిర్మాతల్లో ఒకరిగా వున్న ఆయన, ఆ తరువాత 'కాటమరాయుడు'కి నిర్మాతగా వ్యవహరించారు.
పవన్ కి .. శరత్ మరార్ కి మధ్య ఎంతో స్నేహం ఉండేది. ఇద్దరూ తరచూ కలుసుకుంటూ ఉండేవారు. అలాంటి వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని పవన్ సన్నిహితులు అంటున్నారు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండటమే కలుసుకోకపోవడానికి కారణమని అంటున్నారు. పవన్ .. ఎవరితోనైనా సరే స్నేహాన్ని తొందరగా వదులుకునే వ్యక్తి కాదని బలంగా చెబుతున్నారు.