sunny deol: సన్నీ డియోల్, డింపుల్ చెట్టాపట్టాల్.. బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే!
- లండన్ వీధుల్లో సన్నీడియోల్, డింపుల్ కపాడియా
- సిగిరెట్ తాగుతూ, సన్నీ డియోల్ చేతిలో చెయ్యేసిన డింపుల్
- బస్టాప్ లో కూర్చున్నట్టు కనిపిస్తున్న ఫోటోలు
- బాలీవుడ్ లో వైరల్ అవుతున్న ఫోటోలు
బాలీవుడ్ లో సన్నీడియోల్, డింపుల్ కపాడియాకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వారిద్దరూ లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నప్పటి ఫోటోలు కావడంతో వాటిని ఆసక్తిగా అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. గతంలో డింపుల్ కపాడియోతో సన్నీడియోల్ ప్రేమాయణం నడిపాడనే టాక్ ఉంది.
రాజేష్ ఖన్నా నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ఇది జరిగినట్టు బాలీవుడ్ కధనాలు చెబుతున్నాయి. బస్టాప్ లో కూర్చున్నట్టు కనిపిస్తున్న ఆ ఫోటోల్లో సన్నీడియోల్ చేతుల్లో డింపుల్ కపాడియా చెయ్యి వేసినట్టు ఉంది. మరో ఫోటోలో ఆమె సిగిరెట్ తాగుతున్నట్టు కనిపిస్తుంది. 90లలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందని బాలీవుడ్ టాక్.