priyamani: అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు: నటి ప్రియమణి
- సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో ముస్తఫా రాజ్‌ను చూశా
- నా భర్త ఓ మంచి ఫ్రెండ్ లా ఉంటాడు
- నన్ను చిన్నపిల్లలా చూసుకుంటాడు
- ముస్లింని వివాహం చేసుకుంటున్నందుకు నెటిజన్లు కామెంట్లు చేశారు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో తాను ముస్తఫా రాజ్‌ను చూశానని, కానీ అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని సినీ నటి ప్రియమణి పేర్కొంది. ఇటీవల ఆమె ముస్తఫాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... తన భర్త తనకు ఓ మంచి ఫ్రెండ్ అని తెలిపింది. తనను తన భర్త చిన్నపిల్లలా చూసుకుంటాడని చెప్పుకొచ్చింది. తమ పెళ్లికి కొన్ని రోజుల ముందే తమ బంధువు ఒకరు చనిపోయారని, దీంతో పెళ్లికి హడావుడి చేయాలనుకోలేదని, అందుకే తమ పెళ్లికి తక్కువ మందిని ఆహ్వానించామని చెప్పింది.
తాను ముస్లింని వివాహం చేసుకుంటున్నందుకు కొన్ని రోజుల ముందు నెటిజన్లు చాలా కామెంట్స్ చేశారని ఆమె చెప్పింది. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకోవడానికే తాను తన ప్రేమ గురించి మీడియాకు చెప్పానని, అంతేకానీ ముస్తఫాని పెళ్లి చేసుకోవాలా? అని అనుమతి తీసుకోవడానికి కాదని మండిపడింది.