ramgopal varma: 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై రామ్ గోపాల్ వర్మ మరో క్లారిఫికేషన్
- ఎన్టీఆర్ పాత్ర ప్రకాశ్ రాజ్ ది కాదు
- ఇంతవరకూ ఎవరినీ తీసుకోలేదు కూడా
- మీడియాలో వార్తలు తప్పన్న వర్మ
తాను నిర్మించతలపెట్టిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను ప్రకాశ్ రాజ్ పోషించడం లేదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తన ఫేస్ బుక్ లో ఓ పోస్టును పెట్టాడు. "లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను ప్రకాశ్ రాజ్ పోషించనున్నారని కొన్ని మీడియాల్లో వస్తున్న వార్త తప్పు. ఈ విషయంలో నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. ఇంతవరకూ చిత్ర నటీనటులను ఎవరినీ నిర్ణయించలేదు. అది జరగ్గానే నేనే మీకు తెలియజేస్తాను" అని వర్మ వ్యాఖ్యానించాడు.
కాగా, వైకాపా నేత రాకేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైకాపా ఎమ్మెల్యే రోజాకు కూడా అవకాశం ఉంటుందని వర్మ చెప్పడంతో, తనకే పాత్రను ఇస్తారో తెలియదని, ఏ పాత్ర ఇచ్చినా చేస్తానని రోజా వ్యాఖ్యానించారు.