hero vijay: హీరో విశాల్ ఇల్లు, కార్యాలయంపై జీఎస్టీ అధికారుల దాడులు
- 'మెర్సల్' సినిమాకు విశాల్ మద్దతు
- బీజేపీ నేతపై విమర్శలు
- చర్చనీయాంశంగా మారిన జీఎస్టీ దాడులు
కోలీవుడ్ హీరో విశాల్ నివాసం, కార్యాలయాలపై జీఎస్టీ అధికారులు దాడులు జరిపారు. ఏకకాలంటో జరిగిన ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తమిళనాట దుమారం రేపుతున్న విజయ్ సినిమా 'మెర్సల్'కు విశాల్ నిన్న మద్దతు ప్రకటించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిపై కూడా విమర్శలు గుప్పించారు.
సినిమాలో జీఎస్టీ గురించి ఉన్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్న తరుణంలో ఈ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు 'మెర్సల్' సినిమాకు మద్దతు ప్రకటించినప్పటికీ... విశాల్ ఇంటిపై మాత్రమే దాడులు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.