Kamal Haasan: ఆ రోజున కొత్త పార్టీ ప్రకటన ఉండదు.. ఆ వార్తల్లో నిజం లేదు: కమల హాసన్
- వచ్చేనెల 7వ తేదీన కమల్ పుట్టిన రోజు వేడుక
- పార్టీ ప్రకటన ఉండబోదని తేల్చి చెప్పిన కమల్
- అభిమానులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటా
సినీ నటుడు కమల హాసన్ వచ్చేనెల 7వ తేదీన పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోన్న సందర్భంగా అదే రోజున రాజకీయ పార్టీ పెడతారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై కమల్ స్పందించారు. వచ్చేనెల 7వ తేదీన పార్టీ ప్రకటన ఉండబోదని తేల్చి చెప్పారు. తన అభిమానులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని స్పష్టం చేశారు. ఆ రోజున పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ప్రకటిస్తానని చెప్పారు. మీడియాలో వస్తోన్న కథనాలు నిజం కాదని చెప్పారు. అభిమానులతో భేటీ కావడం చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సంప్రదాయమని ఆయన తెలిపారు.