kancha iaiah: కంచ ఐలయ్య ఇంటి ముందు దూషణలతో కూడిన పోస్టర్లు!

  • జైశ్రీరాం పేరుతో పోస్టర్లు
  • ఐలయ్య ఓ మూర్ఖుడు, అజ్ఞాని
  • అతన్ని క్షమిద్దాం

'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పుస్తకంతో ఇరు రాష్ట్రాల్లో కలకలం రేకెత్తించారు ప్రొఫెసర్ కంచ ఐలయ్య. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటి ముందు జైశ్రీరాం పేరుతో పోస్టర్లు వెలిశాయి. హైదరాబాద్ తార్నాకలో ఉన్న ఐలయ్య ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అతికించారు. "అజ్ఞాని, మూర్ఖుడు అయిన ఐలయ్యను క్షమిద్దాం. హిందూ ధర్మాన్ని రక్షిద్దాం. జై శ్రీరామ్" అంటూ పోస్టర్లలో రాసి ఉంది. ఈ పోస్టర్లు ప్రస్తుతం కలకలం రూపుతున్నాయి.
.

  • Loading...

More Telugu News