sundeep kishan: నా అభిప్రాయం చెబుతానంతే .. అది జోక్యం చేసుకోవడం కిందికి రాదు : సందీప్ కిషన్

  • విమర్శల పట్ల స్పందించిన సందీప్ కిషన్
  • అందులో నిజం లేదు 
  • నిజం చెప్పాలంటే అప్పటి నుంచే ప్లాపులు

సందీప్ కిషన్ తాను చేస్తోన్న సినిమాకి సంబంధించి ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటాడు. అందువల్లనే ఆయన ఎక్కువ మంది దర్శకులతో రెండవసారి కలిసి పనిచేయలేకపోయాడనే విమర్శ వుంది. ఇదే విషయానికి సంబంధించిన ప్రశ్న ఆయనకి  ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకు సందీప్ కిషన్ స్పందిస్తూ .. " ఇన్వాల్వ్ కాదుగానీ .. ఒకప్పుడు నేను ప్రశ్నలు ఎక్కువగా అడిగేవాడిని. మూడు సంవత్సరాలకి ముందు వరకూ అలాగే చేస్తూ వచ్చాను గానీ .. ఆ తరువాత మానేశాను".

"నిజం చెప్పాలంటే అప్పటి నుంచే ప్లాపులు ఎక్కువగా వున్నాయి. అప్పటి వరకూ నా సినిమాలు మినిమమ్ గ్యారెంటీగా ఉండేవి. షూటింగ్ జరుగుతున్నప్పుడు అభిప్రాయం చెప్పడం నా బాధ్యత .. ఆ అభిప్రాయాన్ని రుద్దడం తప్పు. ఏదైనా సరే నాకు నచ్చితే నచ్చిందని చెబుతా ... నచ్చకపోతే నచ్చలేదనే చెబుతా .. అది చెప్పకూడదనడం కూడా తప్పే. ఈ విషయాన్నే కొంత మంది పాజిటివ్ గా తీసుకుంటే, మరికొంతమంది నెగెటివ్ గా తీసుకున్నారు ..  అంతే" అంటూ చెప్పుకొచ్చాడు.        

  • Loading...

More Telugu News