rajasekhar: నేను కూడా వస్తున్నాను.. మా అమ్మానాన్నల్లాగే నన్ను కూడా ఆదరించండి: రాజశేఖర్ కుమార్తె
- త్వరలోనే సినిమాలో నటిస్తున్నా
- మీ ప్రేమ, అభిమానం కావాలి
- పాలకొల్లులో శివాని విన్నపం
'గరుడ వేగ' సినిమా విజయాన్ని సినిమా యూనిట్, కుటుంబసభ్యులతో కలసి రాజశేఖర్ ఎంజాయ్ చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న రాజశేఖర్ అండ్ టీమ్ సందడి చేసింది. ఈ సందర్భంగా రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని మాట్లాడుతూ, త్వరలోనే తాను సినిమాలో నటించబోతున్నానని చెప్పింది. తన తల్లిదండ్రులైన రాజశేఖర్, జీవితలను ఆదరించినట్టుగానే తనను కూడా ఆదరించాలని సినీ అభిమానులను కోరింది. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ, 'గరుడ వేగ' సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.