badminton: బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10కి చేరుకున్న హెచ్ఎస్ ప్రణయ్
- రెండో ర్యాంకులోనే ఉన్న కిడాంబి శ్రీకాంత్
- సింధు 2వ ర్యాంకు, సైనా 11వ ర్యాంకు
- ర్యాంకు మెరుగుపరుచుకున్న అశ్వని పొన్నప్ప, సిక్కి రెడ్డిల జోడీ
తాజాగా విడుదలైన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ తన ర్యాంకును మెరుగుపరుచుకుని భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ టాప్ 10లో స్థానం సంపాదించుకున్నాడు. గతవారం 11వ ర్యాంకులో ఉన్న ప్రణయ్ ఇప్పుడు పదో ర్యాంకుకి చేరుకున్నాడు. మరో స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ రెండో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. వీరిద్దరూ ఇప్పుడు తమ కెరీర్లోనే ఉత్తమ ర్యాంకుల్లో ఉన్నారు. సింగపూర్ ఓపెన్ ఛాంపియన్ బి సాయిప్రణీత్, చైనా ఓపెన్‌లో పాల్గొనకపోవడం వల్ల 16వ ర్యాంకుకి పడిపోయాడు. అలాగే టాప్ 20లో ఉన్న సమీర్ వర్మ ఫిట్నెస్ కోల్పోవడం కారణంగా 23వ ర్యాంకుకి పడిపోయాడు.
మహిళల సింగిల్స్‌లో సైనా, సింధులు వరుసగా 11, 2 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. మహిళల డబుల్స్‌లో అశ్వని పొన్నప్ప, సిక్కి రెడ్డిల జోడీ తమ ర్యాంకుని మెరుగుపరుచుకుని 24వ ర్యాంకులో నిలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీల జోడీ 17వ ర్యాంకులో నిలిచింది.