rajni kanth: జనవరిలో రజనీకాంత్ పార్టీ పక్రటన... వెల్లడించిన సోదరుడు సత్యనారాయణ రావు
- మరోసారి తెరమీదకి వచ్చిన రజనీ రాజకీయప్రవేశ అంశం
- గతంలో వార్తలను తోసిపుచ్చిన సూపర్‌స్టార్
- సందిగ్ధంలో అభిమానులు
రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం విషయంలో అభిమానులు మరోసారి సందిగ్ధంలో పడ్డారు. తాజాగా తమిళనాడులోని ధర్మపురిలో రజనీ అభిమానుల సంఘం జిల్లా కార్యదర్శి కుమారుడి వివాహానికి హాజరైన రజనీ సోదరుడు సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలే వారి సందిగ్ధానికి కారణం. వచ్చే ఏడాది జనవరిలో సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటిస్తారని, రాజకీయాల్లోకి వచ్చి రజనీ ప్రజలకు మంచే చేస్తారని సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.
అయితే గతంలో రాజకీయ రంగప్రవేశం గురించి వచ్చిన వార్తలను రజనీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రోబో 2.0 ఆడియో వేడుకలో కూడా ఈ విషయంపై ఆయన స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ రావు ఇలాంటి ప్రకటన చేయడంతో ఈ అంశం మరోసారి తెరమీదకి వచ్చి చర్చనీయంగా మారింది.